Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 November 2024, 3:50 pm Posted by : ramakrishna

రేవంత్ కేసీఆర్ శిష్యుడిలా వ్యవహరిస్తున్నారు

ఇందల్వాయి, బతుకమ్మ: సీఎం రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబును చూసి పని చేస్త్తాడనుకుంటే కేసీఆర్ శిష్యుడిలా పని చేస్తున్నాడని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇందల్వాయి మండలం గన్నారంలోని  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణతో కలిసి ఎంపీ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనస్, రైతు భరోసా ఎక్కడ లఅని సీఎంను ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అన్ని ఇబ్బందులు ఇఫ్పుడూ పడుతున్నారని అన్నారు. రేవంత్, కేటీఆర్ పరస్పర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ర్టంలో డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఎంపీ వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి,పల్లె గంగా రెడ్డి, కోరుట్ల బీజేపీ నాయకురాలు అనిత, రైతులు తదితరులున్నారు.

Revanth is acting like a disciple of KCR