Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 February 2025, 3:26 pm Posted by : ramakrishna

విజన్ ఉన్న నాయకుడు రేవంత్

నిజామాబాద్, బతుకమ్మ: సీఎం రేవంత్ రెడ్డి తాను పరిగెత్తుతూ మంత్రలను పరిగెత్తిస్తున్నారని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ధైర్యం ముఖ్యమని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. విజన్ ఉన్న రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత ఫామ్ హౌస్ లో పడుకునే నాయకులకు లేదన్నారు. ఉద్యోగాలు, నీళ్ల  కోసమే తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో 50వేలకు మించి ఉద్యోగాలు భర్తీ చేయలేదని, తమ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో 56వేల ఉద్యోగాలను రేవంత్ భర్తీ చేశారన్నారు. ప్రతి ఖాళీని భర్తీ చేస్తామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ఉన్న ఉద్యోగులను పీకేసిందని, ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసిందని విమర్శించారు. రాష్ర్టానికి బీజేపీ ఎంపీలు బడ్జెట్ లో తీసుకువచ్చి సున్నా అని, దీనిపై పట్టభద్రులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని అన్నారు. తాము జిల్లాకు 5కళాశాలలు తెచ్చామని, తెయూ ఇచ్చిందే కాంగ్రెస్ అని అన్నారు. సీఎం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారని, అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకు వెళ్తామన్నారు. నరేంద్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.