ప్రతి మహిళకు రేవంత్ సర్కార్ రూ.35వేల బాకీ
తులం బంగారం, స్కూటీ ఎక్కడ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని చేయాలని అల్టిమేటం జారీ చేశారు. మంగళవారం తెలంగాణ జాగృతి మహిళా విభాగం కార్యకర్తలతో తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. మహిళలకు ఇచ్చిన హామీల పై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం...