Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 July 2025, 7:54 pm Posted by : ramakrishna

పదవి విరమణ చేసిన సిబ్బందికి ఘనంగా వీడ్కోలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ శాఖలో జులై 31న “పదవి విరమణ చేసిన అధికారులు, సిబ్బందికి నిజామాబాద్ పోలిస్ కమీషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సత్కరించి వీడ్కోలు పలికారు. వేల్పూర్ ఎఏస్ఐ సి. హెచ్. మురళిధర్ రాజు, ఎఆర్ ఎస్ఐ ఎల్.నర్సింలు, ఎఆర్ ఎస్ఐ ఎస్. సత్యనారాయణ గౌడ్  వీరికి శాలువలతో సత్కరించి సర్టిఫికెట్ జ్ఞాపికలతో  ఘనంగా సత్కరించడం జరిగినది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వహించి  ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గొప్పవిషయమని అన్నారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని మీరు డిపార్టుమెంట్ కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరం మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని అన్నారు.  ఈ వీడ్కోలు సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్,  తిరుపతి, సతీష్,  వారికుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Retiring staff with that grand farewell