Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 August 2024, 3:31 pm Posted by : ramakrishna

ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పని సరి

  • నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) బి. కోటేశ్వరరావు
  • పోలీస్ శాఖలో పదవి విరమణ పొందిన సిబ్బందికి వీడ్కోలు

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : 

ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) బి. కోటేశ్వరరావు అన్నారు.  నిజామాబాద్ పోలీస్ శాఖలో సుదీర్ఘంగా విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి శనివారం వదవి విరమణ కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు.  ఈ సందర్బంగా నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) బి. కోటేశ్వరరావు మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పని వత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని, ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని మీరు డిపార్టుమెంటల్ కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన ఎల్లవేళల పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు. తమ కుటుంబ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షించారు.  ఆగష్టు నెలలో పదవి విరమణ చేసిన సిబ్బంది వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సి ఎస్ బి లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై సి.హెచ్. బాల్ సింగ్ నాయక్, నిజామాబాద్ పోలీస్ శాఖలో (42) సం||ల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ పొందారు. వీరికి పోలీస్ ఉన్నతాధికారులు శాలువలతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారికి సర్టిఫికేటు (జ్ఞాపికలతో) ” ఘనంగా సత్కరించారు. ఈ వీడ్కోళ్లు సందర్బంగా పోలీస్ కార్యాలయం ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, బషీర్. స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, ఎస్.ఐలు సంతోష్ రెడ్డి, శ్రీ సాయన్న, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా మరియు వారి కుటుంబ అలాగే వారి కుటుంబ సభ్యులు కార్యక్రమంలో హాజరయ్యారు.