పదవి విరమణ సహజం
రుద్రూర్, బతుకమ్మ: ఉద్యోగ విరమణ సహజమని, శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని రుద్రూర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థానం రుద్రూర్ అధిపతి డాక్టర్ సమతా పరమేశ్వరి అన్నారు. శనివారం పరిశోధన స్థానం ఉద్యోగులు జమీలబి, తేజమ్మ పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించి వారి సేవలను గుర్తు చేశారు....