. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య
నిజామాబాద్ , బతుకమ్మ :
ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. శనివారం పదవి విరమణ పొందిన పోలీసులకు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ఎస్సై జి.రాజు, మహిళా పోలీస్ స్టేషన్ ఏ.ఎస్.ఐ ఎస్.చిన్నన్న, ఏ.ఆర్ హెడ్ క్వార్టర్స్ ఆర్.ఎస్.ఐ సి.సాయన్నలకు సీపీ పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపి సర్టిఫికేటు (జ్ఞాపికలతో), శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. మీరు పోలీస్ డిపార్టుమెంటు కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరం ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళలా సహాయపడుతామని, మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో ఆఫీస్ సూపరిండెంట్ శంకర్, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ -ll కే.శ్రీధర్ రెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్ సతీష్, తిరుపతి, షకీల్ పాషా, పదవి విరమణ వారి కుటుంబ సభ్యులు హజరయ్యారు.