- విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడు
- ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
బతుకమ్మ పిట్లం : విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడే చదువులు నేర్పించేది విద్యావంతులను తయారుచేసి, రాజకీయ నాయకులను, ఇంజనీర్లను, శాస్త్రజ్ఞులను, తయారు చేసేది ఒకే ఒక్కడు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ వృత్తి ఎంతో విలువైనదని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. పిట్లం మండల కేంద్రంలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడారు. ఉపాధ్యాయుడు విద్యా బోధించేటప్పుడు నిలబడి బోధిస్తే విద్యార్థులు మాత్రం కూర్చొని శ్రద్ధగా చదువుకోవాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయుడికి ఉన్న ఓపిక సహనం ఎంతో విలువైనదనిఅన్నారు. ఉపాధ్యాయుడు పరమేశ్వర్ రెడ్డి పదవి విరమణ చేసిన సందర్భంగా ఆయనకు శాలువాతో సత్కరించి సన్మానించారు. పరమేశ్వర్ రెడ్డి దంపతులు ఎమ్మెల్యేను శాలువాతు సత్కరించి జ్ఞాపకను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మురళీధర్ గౌడ్,టిఆర్టియు నాయకులు కుషాల్, బన్సీలాల్, నారాయణ, సుదర్శన్ రెడ్డి, సంతోష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్య, కృష్ణమూర్తి పి ఆర్ టి ఓ నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Retirement is common