Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 October 2024, 6:17 pm Posted by : ramakrishna

పదవి విరమణ సర్వసాధారణం

బతుకమ్మ, ఆర్మూర్ :  జీవితంలో పదవి విరమణ సర్వసాధారణమని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ అన్నారు.   ఆర్మూర్ పోస్ట్ మెన్ గా పని చేసి ఆదివారం పదవి విరమణ పొందిన గాజుల భూమన్న దంపతులను ఆయన శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడారు. గాజుల బుమన్న పోస్ట్ మెన్ గా దాదాపు 40 సంలుగా మంచి క్రమశిక్షణ తో అంకిత భావంతో సేవాలాందిస్తున్నారని అన్నారు. ఇంత మంచి మనిషి పోస్ట్ మెన్ గా ఉండి సేవాలాందించడం ప్రజల అదృష్టం అని తెలిపారు. పదవి విరమణ తరువాత వారి శేష జీవితం ఆనందంగా, సంతోషంగా సంపూర్ణ ఆరోగ్యంగా జరుగలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నామని  తెలిపారు.  ఈ కార్యక్రమంలో  బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ మరియు బీజేపీ ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు పాల్గొన్నారు.