హెడ్ కానిస్టేబుల్ కోలా విటల్ పదవి విరమణ వేడుకలు
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం హెడ్ కానిస్టేబుల్ కోలా విటల్ పదవి విరమణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శాలువా, పూలమాలాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్ సీఐ కృష్ణ, రుద్రూర్ ఎస్సై సాయన్న, కోటగిరి ఎస్సై సందీప్, వర్ని ఎస్సై, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.