- విద్యాశాఖాధికారి మెడకు పాత పంచాయితీలు
- ఏసీబీ విచారణతో గుబులు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ విద్యాశాఖ అధికారిగా పని చేస్తూ దుర్గప్రసాద్ హయంలో జరిగిన పలు వివాదాస్పద నిర్ణయాలు విద్యాశాఖను కుదిపేస్తున్నాయి. దుర్గప్రసాద్ ప్రస్తుతం మోడల్ స్కూల్ డైరెక్టర్ గా పని చేస్తుండగా ఆయన డిఈవోగా పని చేసిన సమయంలో పలు ఫిర్యాదులపై ఏకంగా ఏసీబీ విచారణ జరుపుతుండడం కలకలం రేపుతుంది. ఇటీవల జిల్లా విద్యాశాఖలో పని చేస్తున్న పలువురిని ఏసీబీ విచారించింది. తాజాగా అప్పటి డిఈవో దుర్గప్రసాద్ తో పాటు ఆర్జేడి ఒకరికి తాఖీదులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నెల 28న అధికారులు మౌఖిక విచారణకు పిలుపురావడం విద్యాశాఖలో సంచలనంగా మారింది. ఏసీబీ అధికారులతో విద్యాశాఖాధికారులు అందులో సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినప్పటికీ మొదటిసారి పాత పంచాయితీల విషయంలో విచారణ జరుగడం ఇదే మొదటిసారి. ఇటీవల డిఈవోగా దుర్గప్రసాద్ పని చేసినప్పుడు ఉన్న అధికారుల్లో అప్పటి జీఈసీవోతో పాటు పలు సెక్షన్ల సూపరింటెండెంట్లను, సీనియర్ అసిస్టెంట్లను విచారించారు. ఆనాడు జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరుగడం విద్యాశాఖలో అధికారులే జీర్ణించుకోలేకపోతున్నారు.
నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిగా పని చేసిన దుర్గప్రసాద్ ప్రస్తుతం మోడల్ స్కూల్ డైరెక్టర్ గా పని చేస్తూ ఈ నెల 31న పదవి విరమణ చేయనున్నారు. పదవి విరమణ పట్టుమని పది రోజులు లేని సమయంలో జరుగుతున్న విచారణ కలకలం రేపుతుంది. డిఈవో పై అప్పట్లో వచ్చిన అవినీతి, అక్రమాలపై ఏసీబీ విచారణ జరిపి చర్య తీసుకుంటుందో లేదో తెలియదు కానీ దుర్గప్రసాద్ మాత్రం నిజామాబాద్ జిల్లాలోనే శివారు మండలాల్లో తనిఖీల పేరుతో తిరుగుతుండడంపై చర్చ జరుగుతుంది. పదవి విరమణ సమయంలో ఏసీబీ కేసులు నమోదైతే రిటైర్మెంట్ తర్వాత దక్కాల్సిన ప్రయోజనాలు అందవు. ఈ నేపథ్యంలో డిఈవో అవినీతి, అక్రమాల విషయంలో విచారణకు హాజరవుతారా లేదా అని చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా ఆర్జేడీ స్థాయి అధికారికి కూడా తాఖీదులు అందాయని చర్చ జరుగుతుండగా విద్యాశాఖలో మాత్రం వాటిని ధ`వీకరించడం లేదు.
- టీఎల్ఎం వ్యవహరంలో జీఈసీవోపై వేటు తప్పదా? . . . .
నిజామాబాద్ జిల్లాలోని 27 కేజీబీవీలలో లర్నింగ్ టీచింగ్ మెటీరియల్ కొనుగోలు వ్యవహరం విద్యాశాఖను కుదుపేస్తుంది. నిజామాబాద్ జీఈసీవో ఆదేశాలతో కేజీబీవీల ఎస్ వోలు 35 లక్షల రూపాయలను కామారెడ్డికి చెందిన ఓ ఏజెన్సీ ఖాతాలో జమ చేశారు. తీరా సర్వశిక్షా అభియన్ ఆధ్వర్యంలో ఎల్ టీఎం సరఫరా చేస్తామని ఉత్తర్వులు రావడంతో డబ్బులు వెనక్కి రాకపోవడంపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నిజామాబాద్ డిఈవోతో పాటు అప్పటి అసిస్టెంట్ కమిషనర్ కు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం రిటైర్ అయిన ఆనాటి ఏసీ విద్యాశాఖ డైరెక్టర్ నోటీసులకు స్పందించిన డిఈవో నుంచి ఇప్పటి వరకు సమాధానం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు చేరలేదని సమాచారం. ఈ వ్యవహరంలో నిబంధనలకు విరుద్దంగా టెండర్లు లేకుండానే కేజీబీవీలకు సంబంధించిన నగదును ప్రైవేట్ ఏజెన్సీ ఖాతాలో వేయించిన జీఈసీవోపై వేటు ఖాయమని చర్చ జరుగుతుంది. జిల్లాలో పాత డిఈవో దుర్గప్రసాద్ హయంలో ఆనాటి జీఈసీవో వనిత పై వచ్చిన ఆరోపణలు కూడా ఏసీబీ విచారణకు కారణమన్న చర్చ జరుగుతుంది. ప్రస్తుతం జీఈసీవో కారణంగానే టీఎల్ఎం విషయంలో విద్యాశాఖ అధికారులకు నోటీసులు ఇవ్వడం జిల్లా విద్యాశాఖను కుదిపేస్తుంది.