Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 August 2025, 7:38 pm Posted by : ramakrishna

పదవి విరమణ చేసిన వ్యక్తిగత సహయకులు లక్ష్మారెడ్డిని ఘనంగా సన్మానించిన పోచారం

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పొచారం శ్రీనివాస రెడ్డి వ్యక్తిగత సహాయకులు పాతూరి లక్ష్మా రెడ్డి పదవీవిరమణ సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డిఎల్ ఎన్ గార్డేన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  పోచారం శ్రీనివాస్ రెడ్డి హజరై ఘనంగా సన్మానించి సత్కారించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తు లక్ష్మారెడ్డి పదవి విరమణ చేశారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, పోచారం శంభు రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, నుడా ఛైర్మెన్ కేశ వేణు, జడ్పి సిఇఓ సాయ గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై లక్ష్మా రెడ్డి  దంపతులను పూలమాల, నూతన వస్త్రాలు, శాలువ, మెమంటోలతో ఘనంగా సత్కరించారు.

Retired personal assistants pay tribute to Lakshma Reddy