Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2025, 7:13 pm Posted by : ramakrishna

కుక్కల దాడిలో రిటెర్డ్ ఉద్యోగికి తీవ్రగాయాలు

ఆర్మూర్, బతుకమ్మ : పట్టణం లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముంటున్న రిటెర్డ్ పోస్టల్ ఉద్యోగి శ్రీనివాస్ రావు పై శనివారం వీధి కుక్కలు దాడి చెయ్యడం తో ఆయనకు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం వాకింగ్ నిమిత్తం వెళ్తున్న క్రమంలో కుక్కల దాడిలు శ్రీనివాస్ రావు పై ఆకస్మికంగా దాడి చేయగా ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో పాటు ఎడమ కాలు విరిగింది.క్షేతగాత్రున్ని ఆర్మూర్ లోని ఓ ప్రయివేట్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ లో చూయించగా ఆయన కాలు ఫ్రాక్చర్ అయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించి, ఆయన  మూడు మాసాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా భాధితుడు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కుక్కల బెడత విపరీతంగా ఉందని,  ఇంట్లో నుంచి బయటికి రావడం కష్టమై పోయిందన్నారు.  కుక్కలు విపరీతంగా మనుషులపై పడి దాడులకు పాల్పడుతున్నాయని సంబంధిత మున్సిపల్ కమిషనర్ తక్షణమే శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుని అనిమల్ యాక్టును దృష్టిలో పెట్టుకోకుండా ప్రజల సంక్షేమంను దృష్టిలో పెట్టుకొని తగు చర్యలు తీసుకోవాలని భాధితుడు శ్రీనివాస్ రావు కోరారు.