ఖైదీల పరివర్తనతో ఫలితాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్ర కారాగారాన్ని సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుభేదార్ తో కలిసి సందర్శించారు.వారివెంట కేంద్ర కారాగార సూపరింటెండెంట్ చింతల దశరథ్, జైలర్ ఉపేంద్ర ఉన్నారు. కారాగారంలోని మహిళల, పురుషుల బ్యారక్ లను పరిశీలించారు.వసతులు ఎలా ఉన్నాయి అంటు ఖైదీలను అడిగి తెలుసుకున్నారు.భోజన న్యాణ్యతల వివరాలు అడిగారు.కారాగారంలో వసతులు బాగానే ఉన్నాయని, జైలు సిబ్బంది...