Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 January 2025, 4:06 pm Posted by : ramakrishna

బాధ్యతాయుత నాయకులను ఎన్నుకోవాలి

  • జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి  దావలపూర్ శ్రీనివాస్ రెడ్డి

 

మద్నూర్, బతుకమ్మ: ప్రజలను గౌరవించి ప్రజల మన్ననలను పొందే అనుభవజ్ఞుడైన  రాజకీయ నాయకులను బాధ్యత గల ఓటు హక్కు తో ఎన్నుకోవాలని  జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి (జిల్లా అదనపు కలెక్టర్) దావలపూర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సంధర్భంగా మద్నూర్ మండల కేంద్రంలో విద్యార్థులు మరియు మండల అధికారుల తో తహసీల్దార్ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహనికి పూలమాలతో నివాళి అర్పించారు. అంతరం జాతీయ ఓటర్ ప్రతిజ్ఞ హాజరైన అందరితో చేయించారు. అక్కడి నుండి ర్యాలీగా రైతు వేదిక వరకు చేశారు. రైతు వేదిక లో ఏర్పాటు చేసిన సభలో అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మనం ఎన్నుకునే రాజకీయ నాయకులు బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది కాబట్టి ప్రతి పౌరుడు ఆలోచించి జాగ్రత్తగా ఓటు వేయాలన్నారు. విద్య వ్యవస్థ బాగుంటే అన్నింటిని బాగు చేయవచ్చు కాబట్టి వాటికి కావలసిన వనరులను ఏర్పాటు చేసే వారిని, మనల్ని, మండలం , జిల్లా, రాష్ట్రం ను  ఎవరు బాగు చేస్తారో వారినే ఎన్నికలో ఎన్నుకోవాలన్నారు. విద్యార్థుల నుండి కొత్త కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు రావాలని, దేశ అభివృద్ధికి నూతన ఆవిష్కరణలు ఎంతో ఉపయోగ పడతాయని తెలిపారు.

Responsible leaders should be elected

జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ ల నమోదులో  స్త్రీ ఓటర్లు అధికంగా ఉన్నారని ఇది అభినందించ దగ్గ పరిణామం అన్నారు. పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల పోలింగ్ శాతం అధికంగా ఉందన్నారు. జనరల్ పోలింగ్ శాతం కూడా గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని వ్యవస్థ మన ఎన్నికల వ్యవస్థ ఒక్కటే అన్నారు. అంత గొప్ప వ్యవస్థ మన భారత దేశంలో ఉందన్నారు. గ్రామ పోలింగ్ కేంద్ర అధికారి నుండి దేశ ఎలక్షన్ కమిషనర్ వరకు పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది అని దాంట్లో అందరి భాగస్వామ్యం ఉందన్నారు. ఎన్నికల్లో మీడియా పాత్ర కూడా కీలకం అన్నారు. అందరి సహకారంతో ప్రశాంత వాతావరణంలో జుక్కల్ నియోజక వర్గంలో ఎన్నికలు జరుపుకున్నామన్నారు. అనంతరం 70 ఏళ్లు పై బడిన వృద్ధ ఓటర్ లకు సన్మానించారు. వారికి ప్రశంస పత్రాలు అందించారు. అదేవిధంగా 18 సం” లలో చేరిన యువ ఓటర్లకు నూతన ఓటర్ కార్డులు మరియు ప్రశంస పత్రాలు అందించారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉపన్యాస , వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు. మండలంలో ఉత్తమ బూత్ లెవెల్ ఆఫీసర్ , మరియు సూపర్ వైజర్ లను సన్మానించి ప్రశంస పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్, ఎంపీడీవో రాణి, ఎం ఈ వో,  రాములు, నాయబ్ తహసీల్దార్ భరత్, గిర్ధవార్ శంకర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, మండల కేంద్రం లోని లెక్చరర్స్, టీచర్స్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Responsible leaders should be elected