పశు వైద్య శిబిరానికి స్పందన

పిట్లం, బతుకమ్మ: పశుసంవర్ధకా శాఖ, పశుగణాభివృద్ధిసంస్థ సంయుక్తంగా మండలంలోని చిల్లర్హి గ్రామంలో సోమవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. పశువులకు కృత్రిమ గర్భాధారణ, దూడల జననంతో కలిగే లాభాలను రైతులకు వివరించారు. 65 గేదెలు, ఆవులకు చూడి పరీక్షలు చేసి 76 దూడలకు నట్టల నివారణ మందు వేశారు. ఆరు గేదెలకు కృత్రిమ గర్భాధారణ టీకాలు వేశారు. 45 పశువులలో గర్భికోశ వ్యాధులకు చికిత్స వేయడం, లాభసాటి పశుపోషణలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో స్థానిక గోపాలమిత్ర అహ్మద్, గోపాలమిత్ర పర్యవేక్షకుడు బస్వరాజ్, గ్రామపెద్దలు,...