గురువులను గౌరవించడం విద్యార్థుల భవిష్యత్తుకు పునాది      

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు. మండల విద్యాధికారి జి కృష్ణ హరి మాట్లాడుతూ గురువులను పూజించడం అంటే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేయడమని అన్నారు. ఎల్లప్పుడూ విద్యార్థుల భవిష్యత్తు కోసం తపనపడే గురువులను ఎన్నిసార్లు పొగిడిన తక్కువేనని అన్నారు. ఒక విద్యార్థిని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా తీర్చిదిద్ది విద్యాబుద్ధులు నేర్పించడం గొప్ప విషయం అన్నారు. ఒక విద్యార్థి గురువు దగ్గర పాఠాలు నేర్చుకున్న తర్వాత తన జీవితకాలం మొత్తం ఆ...