ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు. మండల విద్యాధికారి జి కృష్ణ హరి మాట్లాడుతూ గురువులను పూజించడం అంటే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేయడమని అన్నారు. ఎల్లప్పుడూ విద్యార్థుల భవిష్యత్తు కోసం తపనపడే గురువులను ఎన్నిసార్లు పొగిడిన తక్కువేనని అన్నారు. ఒక విద్యార్థిని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా తీర్చిదిద్ది విద్యాబుద్ధులు నేర్పించడం గొప్ప విషయం అన్నారు. ఒక విద్యార్థి గురువు దగ్గర పాఠాలు నేర్చుకున్న తర్వాత తన జీవితకాలం మొత్తం ఆ గురువును ఎన్నడూ మరిచిపోడని అన్నారు.విద్యార్థులను గురువులు తమ పిల్లల్లాగా భావించి చదువులు నేర్పించడం జరుగుతుందన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి విద్యాధికారి తో పాటు ఉపాధ్యాయులను సన్మానం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్,జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి,నాయకులు చెన్ని బాబు,మెండే శ్రీనివాస్,గుర్రం రాములు,చెట్టుపల్లి బాలయ్య,ఎడ్ల రాజ్ కుమార్,బండారి బాల్ రెడ్డి, పందిర్ల శ్రీను, ఇలియాస్, బిపేట రాజు, చందు,నవాబ్,చల్ల పద్మా రెడ్డి, కృష్ణారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.