ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలకు పంపాలని తీర్మానం
లింగంపేట్, బతుకమ్మ : లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామానికి చెందిన ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాల పంపాలని తీర్మానం చేశారు. శుక్రవారం పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాఠశాల ఆవరణలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల్లో పంపవద్దని ఈ సందర్భంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పంచాయతీ పాలకవర్గ సభ్యులు చేసిన తీర్మానం కాపీని లింగంపేట్ మండల విద్యాధికారి అంజల్ రెడ్డి అందించారు. మా పిల్లలకు పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధన అందించాలని...