లింగంపేట్, బతుకమ్మ :
లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామానికి చెందిన ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాల పంపాలని తీర్మానం చేశారు. శుక్రవారం పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాఠశాల ఆవరణలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల్లో పంపవద్దని ఈ సందర్భంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పంచాయతీ పాలకవర్గ సభ్యులు చేసిన తీర్మానం కాపీని లింగంపేట్ మండల విద్యాధికారి అంజల్ రెడ్డి అందించారు. మా పిల్లలకు పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధన అందించాలని ఎం ఏను కోరారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన బోధన చేస్తామని, విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అలాగే ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంచి విద్యాబోధన అందేలా చూడాలని విద్యాధికారికి సూచించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.