గ్రామంలో మద్యం విక్రయించొద్దని తీర్మానం

ఎల్లారెడ్డి, బతుకమ్మ: తమ గ్రామంలో మద్యం విక్రయించొద్దని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని అజామాబాద్(అంకుల్ పేట) గ్రామస్తులు తీర్మానం చేశారు. గ్రామస్తులంతా మద్యానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని ఏకగ్రీవ తీర్మాణం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. మద్యం విక్రయించొద్దని తీర్మానం చేసిన గ్రామస్తులు ఇతర గ్రామాల ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.