భిక్కనూరు, బతుకమ్మ :
భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వరనగర్ గ్రామంలో గ్రామ సభలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫ్యూజన్ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా గురువారం తీర్మానం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు వ్యతిరేకించిన కారణంగా ఈరోజు గ్రామసభలో వ్యతిరేక తీర్మానం చేశామని సర్పంచ్ జనగామ రాణి అన్నారు. ఇప్పటికే ఎం ఎస్ ఎన్ కంపెనీ వల్ల గాలి నీరు కలుషితం అవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సాయంత్రం 6 గంటల నుంచి వాసన వెదజల్లడంతో శ్వాస కూడా ఆడడం లేదని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫ్యూజన్ ఫార్మా కంపెనీకి అనుమతించవద్దని, ఈ ఫార్మా కంపెనీ వల్ల వాయు కాలుష్యం కారణంగా పిల్లలు, వృద్దులు అనారోగ్యం బారిన పడతారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మ కంపెనీకి భిక్కనూరు మండలంలో అనుమతి ఇవ్వవద్దని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజు వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు ఉన్నారు.
