Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 June 2025, 9:50 pm Posted by : ramakrishna

పరిశోధన సమాజ ప్రయోజనాలకు ఉపయోగపడాలి

మొయినాబాద్, బతుకమ్మ :  రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్‌లో ఉన్న చైతన్య డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం నుండి కెమిస్ట్రీ విభాగంలో యం.తిరుపతి  గారు పిహెచ్ డి పట్టాను పొందారు. ప్రొఫెసర్ యం రవీందర్ ర్యవేక్షణలో “డిజైన్  సింథసిస్ అండ్ మొలిక్యూలర్ డాకింగ్ అఫ్ నొవెల్ 7 – అజా  ఇండోలే  డేరివేటివ్స్ ఆస్ ఏంటిక్యాన్సర్ ఏజెంట్స్” అనే అంశంపై ఆయన డాక్టరేట్ పరిశోధనను కేంద్రీకరించారు. పీహెచ్‌డిని విశ్వవిద్యాలయం డైరెక్టర్ అండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సాత్విక రెడ్డి అధికారికంగా ప్రదానం చేశారు. ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ “కెమిస్ట్రీ పరిశోధన యొక్క కీలక పాత్రను ఆయన నొక్కిచెప్పారు. ఇది విద్యాాభివృద్ధిని ప్రోత్సహించడమే కాకుండా సామాజిక శ్రేయస్సును కూడా బాగా మెరుగుపరచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  వైస్ ఛాన్సలర్ శంకర్ లింగం, ప్రొఫెసర్ ఎం. రవీందర్ (రిజిస్ట్రార్), ప్రొఫెసర్ క్రిస్టోఫర్ రూబెన్ (డీన్ ఆఫ్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్), డీన్ అడ్మనిస్ట్రేషన్ కవిత,  ప్రొఫెసర్ బి. రాజేందర్ రెడ్డి (కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్), ప్రొఫెసర్ జగదీష్ కుమార్ ఈగ  (డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్), గాదె రాంబాబు (అసిస్టెంట్ రిజిస్ట్రార్,  పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) వంటి అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.