ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ బృందాలు సహాయక చర్యలను ముమ్మురం చేశాయి.  ప్రమాదంలో టన్నెల్ బోరింగ్ మెషీన్‌ దెబ్బతింది. విడిభాగాలు టన్నెల్‌లో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బురద ప్రవాహం పెరుగుతోంది. ఈఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు మంత్రుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. పక్క నుంచి తవ్వకాలకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచనలు  చేశారు.కార్మికులను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగించాలని...