Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 July 2025, 3:49 pm Posted by : ramakrishna

సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని టైలర్స్ కాలనీలో గల సమస్యలు పరిష్కరించాలని సీపీఏం నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ టైలర్స్ కాలనీలో గత 20 సంవత్సరాలుగా నెలకొన్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రజలు లేని చోట రోడ్లు, మురికి కాలువల నిర్మాణం జరుగుతున్నాయని ప్రజలు ఉన్నచోట మురికి కాలువలు సిసి రోడ్ లో నిర్మాణం జరగకపోవడం వల్ల మురికి నీళ్లు నిలువ ఉండడం వల్ల ఈగలు, దోమలతో విష జ్వరాలు వచ్చి ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని తెలిపారు ఇండ్లలోకి పాములు, తేలు విషపురుగులు  రావడం వల్ల భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. ప్రజలు ఉన్నచోట ముందుగా మురికి కాలువలు, సీసీ రోడ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న కాలంలో టైలర్స్ కాలనీలో ఉన్న స్థానిక సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు లతా, జ్యోతి, భూలక్ష్మి, రుకుంబాయ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Request to the Municipal Commissioner to resolve the issues