బతుకమ్మ, భిక్కనూరు : భిక్కనూరు మండల కేంద్రంలోని నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బిజెపి మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ శుక్రవారం ఎమ్మెల్యే రమణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భిక్కనూరు గ్రామంలో అక్రమ నిర్మాణాలను తొలగించి రోడ్డు విస్తరణలో ఎంతోమంది నిరుపేద కుటుంబాలు వారి సొంత ఇంటిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో జీవనాన్ని సాగిస్తున్నారని నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కొంతమంది ప్రజాపాలకులమని చెప్పుకునేవారు ప్రజల ఆస్తులను ధ్వంసం చేసి వారి ఆస్తులను కాపాడుకోవడానికి కోర్టుల ద్వారా స్టే ఆర్డర్లను తెచ్చుకోవడం మళ్లీ గత కొంతకాలంగా నూతన నిర్మాణాలు కొనసాగించడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని వాటిపై న్యాయం జరిగే విధంగా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారుల ద్వారా పూర్తి సమాచారం సేకరించి 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు . ఈ కార్యక్రమంలో మండల బిజెపి జనరల్ సెక్రెటరీ అత్తిలి తిరుమలేష్,గంధం రాజు, చంద్రశేఖర్ గౌడ్ బిజెపి కార్యకర్తలు ఉన్నారు.