రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ కు వినతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ నిజామాబాద్ కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ అధిక వర్షాలు, భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్లు పూర్తిగా గుంతలుగా మారి, ద్విచక్ర వాహన దారులు తరచూ స్కిడ్ కావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. 48వ డివిజన్ రోడ్డు వినాయక్ నగర్ నుండి రిలయన్స్ పక్కదారి...