Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 November 2025, 4:00 pm Posted by : ramakrishna

రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ కు వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ నిజామాబాద్ కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ అధిక వర్షాలు, భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్లు పూర్తిగా గుంతలుగా మారి, ద్విచక్ర వాహన దారులు తరచూ స్కిడ్ కావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. 48వ డివిజన్ రోడ్డు వినాయక్ నగర్ నుండి రిలయన్స్ పక్కదారి మీదుగా ప్రెసిడెన్సీ స్కూల్ వరకు రహదారి రోటరీ నగర్, ఎస్‌.ఆర్‌. కాలేజ్ సమీప రోడ్లువినాయక్ నగర్ ప్రధాన రహదారి పూర్తిగా గుంతలతో నిండిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని తెలిపారు. రూటర్ నగర్‌లో అండర్ డ్రైనేజీ మోరీలు, రోడ్డు వసతి లేకపోవడంతో మురికి నీళ్లు నిల్వ ఉండి దోమల బెడద పెరిగి, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే రోడ్డు మరమ్మత్తులు, అండర్ డ్రైనేజీ పనులు చేపట్టి ప్రజలకు ఉపశమనం కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్వైఎఫ్ జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్, ఏఐపీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్ సింగ్ ఠాగూర్, నాయకులు సయ్యద్ రఫీ ఉద్దీన్, ఇమ్రాన్ ఖాన్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.