విజేత జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక, తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవికుమార్ కు బోధన్ పట్టణంలోని విజేత జూనియర్ కళాశాల పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా టీవీయువి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రామావత్ లాల్ సింగ్, టీజీవిపి జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ గత  రెండు రోజుల కిందట బోధన్ లోని విజేత జూనియర్ కళాశాల హాస్టల్లో చదివే విద్యార్థి తప్పిపోయారని, కళాశాల...