విద్యార్థులకు సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని వినతి

  నసురుల్లాబాద్, బతుకమ్మ :   విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సర్వీసులను పాఠశాల సమయాలకు అనుగుణంగా నడపాలని కోరుతూ బీజేపీ నాయకులు బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్‌ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. నసురుల్లాబాద్ మండలంలోని హాజీపూర్, సంగెం, అంకోల్ గ్రామాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు ప్రతిరోజూ నెమలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 7 గంటలకు బస్సు రావడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ఉదయం వేళల్లో బస్సు...