Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 9:10 pm Posted by : ramakrishna

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని వినతి

 

కమ్మర్ పల్లి, బతుకమ్మ :

 

కమ్మర్ పల్లి మండలం కోనాసముందర్ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సెంటర్ ను ప్రారంభించాలని రైతులు సోమవారం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు జైడి శ్రీనివాస్, శంకర్, నాగరాజు, గంగారెడ్డి, నర్సయ్య, ప్రశాంత్, బాలయ్య, లింబయ్య, హన్మంత్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.