జీహెచ్ఎం ప్రమోషన్స్ ఇప్పించాలని ఎమ్మెల్సీకి వినతి

నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వం నిలిచిపోయిన జీహెచ్ఎం(గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు)  ప్రమోషన్స్ ఇప్పించాలని  జీహెచ్ఎం సంఘం నాయకులు డిమాండ్ చేశారు.ఈమేరకు శుక్రవారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లా జీహెచ్ఎంలు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వినతి పత్రం అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తాము స్కూల్ అసిస్టెంట్స్ గా నియామకం పొంది 24 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్స్ ఇవ్వలేదన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 650 జీహెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన జీహెచ్ఎం వెబ్ ఆప్షన్స్ ఇప్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.