Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 December 2024, 8:05 pm Posted by : ramakrishna

ఎమ్మెల్యేకు వినతి

నిజామాబాద్, బతుకమ్మ : నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులలో అనుమతించే విధంగా  వైద్య, ఆరోగ్యశాఖ మంత్రితో చర్చించాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీం పరిధిలోని వెల్నెస్ సెంటర్ను పటిష్ట  పరచాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డికి  శనివారం కలసి విజ్ఞప్తి చేశారు. పెన్షనర్ డే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు వారు అభినందించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు ఎమ్మెల్యేను శాలువతో సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. ఎమ్మెల్యేలు కలిసిన వారిలో జిల్లా అధ్యక్షుడు కే రామ్మోహన్ రావు, జిల్లా నాయకులు శిర్ప హనుమాన్లు, ఇ.వీ.ఎల్. నారాయణ, హమీద్ ఉద్దీన్, లక్ష్మీనారాయణ, లింగయ్య, శ్రీనివాస్ రావు, రైసుద్దీన్, జీవన్ రావు తదితరులు ఉన్నారు.