Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 5:07 pm Posted by : ramakrishna

కోతి, పాము కాటులకు మందులు అందుబాటులో ఉంచాలని వినతి

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

డిచ్ పల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో కుక్క, కోతి, పాము కాటులకు మందులు అందుబాటులో ఉంచాలని ఘన్ పూర్ యువత హాస్పిటల్ సూపరిండెంట్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాసరి సాయినాథ్ మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం గ్రామంలో ఒకరికి కోతి కరిస్తే అతన్ని తీసుకోని హాస్పిటల్ కు వస్తే మందు లేకపోవడం వల్ల ఇబ్బంది కలిగిందని వారన్నారు. మండలంలో గల గ్రామాలలో కోతుల, కుక్కల బెడద చాలా ఉందని, వాటి వల్ల చాలా మంది వాటి బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా హాస్పిటల్ కు వచ్చిన గర్భిణీ స్రిలకు ఇబ్బంది కలగకుండా చూడాలని వారు కోరారు. రాత్రి సమయంలో పెషేంట్స్ వస్తే చిన్నగా దెబ్బలు తగిలినా కూడా నిజామాబాద్ పంపిస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమం లో కె. కిషోర్, వి. శ్రీనివాస్, బి. ప్రమోద్, కె. సురేష్, ఏ. ప్రసాద్, కె. శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.