Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 July 2025, 5:50 pm Posted by : ramakrishna

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలని డీఈఓకు వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉపాధ్యాయుల ప్రమోషన్ల కౌన్సిలింగ్ లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కు మాదిగ ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సిల్మల సురేష్, జాతీయ ఉపాధ్యక్షులు తెడ్డు గంగారం, జిల్లా అధ్యక్షుడు నూతపల్లి మారుతి మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణలో ఏ బి సి మూడు గ్రూపులు ప్రకారంగా నియమ నిబంధనలకు అనుకూలంగా రోస్టర్ పాయింట్ ను పాటిస్తూ ఉపాధ్యాయుల ప్రమోషన్లను పారదర్శకంగా కోరారు. ప్రమోషన్లలో వర్గీకరణ అమలు చేయడం వల్ల ఎస్సీలలోని అట్టడుగు సమాజానికి సమన్యాయం జరుగుతుందని తెలియజేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ పాయింట్ల ప్రకారం ప్రమోషన్లు కొనసాగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి శ్రీనివాస్, గద్దల రమేష్, శంకర్, ప్రవీణ్, బబ్లు తదితరులు పాల్గొన్నారు.