నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హనుమాన్ శోభా యాత్రను నిర్వహించడానికి పర్మిషన్ కోసం విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో నగర పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, అడిషనల్ డీజీపీ బస్వా రెడ్డి ని కలిసి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా దినేష్ ఠాకూర్ మాట్లాడుతూ ఏప్రిల్ 2 న హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ లలో వీర హనుమాన్ విజయ శోభాయాత్రలు నిర్వహిస్తున్నామని, ఈ శోభాయాత్ర లకు పర్మిషన్ ఇవ్వాలని వారు సీపీ ని కోరారు. ఈ కార్యక్రమంలో విహెచ్ పి విభాగ్ కార్యదర్శి తమ్మలా కృష్ణ, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, ప్రాంత గొరక్ష కృషి సంపర్క ప్రముఖ్ దాత్రిక రమేష్, హిందూవాహిని జిల్లా సంయోజక్ దాసరి సాయి ప్రసాద్, ప్రాంత కార్యాలయ కార్యకరి అనిల్ కధం, విహెచ్ పి జల్లా సేవప్రముఖ్ రామ్ ప్రసాద్ చెటర్జీ, విహెచ్ పి కోశాధికారి నాంపల్లి శేఖర్, విహెచ్ పి నగర కార్యదర్శి బాసొల్లా నీకేష్, హిందూ వాహిని నగర సంయోజక్ కార్గే గజానాన్ తదితరులు పాల్గొన్నారు.