పేదలకు డబుల్​ బెడ్​రూం ఇళ్లు కేటాయించాలని వినతి

నిజామాబాద్​ సిటీ, బతుకమ్మ:  నగరంలోని పేదప్రజలకు డబుల్​ బెడ్​రూం ఇళ్లను కేటాయించాలని ఎంఐఎం నాయకులు జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లిని కోరారు. బుధవారం జిల్లాకు వచ్చిన ఇన్​ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు.  ఈసందర్భంగా ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్​ మాట్లాడుతూ.. నగర శివారులోని 10వ డివిజన్​ పరిధిలో నాగారం బొడ్డెమ్మ చెరువు, భారతి రాణి కాలనీల్లో అధికారులు పేదల ఇళ్లను కూల్చేశారన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లను కూల్చడంతో పేదలు ఇప్పటికీ.. దుర్భర జీవితాలు గడుపుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు....