నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని పేదప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని ఎంఐఎం నాయకులు జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లిని కోరారు. బుధవారం జిల్లాకు వచ్చిన ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ మాట్లాడుతూ.. నగర శివారులోని 10వ డివిజన్ పరిధిలో నాగారం బొడ్డెమ్మ చెరువు, భారతి రాణి కాలనీల్లో అధికారులు పేదల ఇళ్లను కూల్చేశారన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లను కూల్చడంతో పేదలు ఇప్పటికీ.. దుర్భర జీవితాలు గడుపుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని విన్నవించారు. ఇళ్ల కూల్చివేతల్లో నష్టపోయిన వారి పేర్లను డబుల్ బెడ్రూం ఎంపిక కమిటీ సభ్యులు పరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు.