తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనాలని ప్రజావాణిలో వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనాలని ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా  రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నగర కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ.. ఇటీవల నిజామాబాద్ జిల్లా పరిధిలో కురిసిన అకాల వర్షాల వలన వేలాది మంది రైతుల కష్టార్జిత పంటలు తడిసి పాడవుతున్నాయన్నారు. పంటను రక్షించుకునే స్థితిలో రైతులు లేరని, ఈ పరిస్థితుల్లో రైతుల ఆర్థిక నష్టం తీవ్రంగా పెరుగుతోందని తెలిపారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎటువంటి...