న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యాయవాది పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని సరస్వతి నగర్ లో గల సంస్థ కార్యాలయంలో సోమవారం జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ జాతీయ పథకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహనతో దేశ ప్రజల సంక్షేమం కోసం యువత కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బండారి కృష్ణానంద్, సి సాయి రెడ్డి,...