గణతంత్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 76 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం నగరంలోని దుబ్బ ప్రాంతంలో గల తిలక్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిలక్ యూత్ జనరల్ సెక్రటరీ గంట భీమన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిలక్ యూత్ అధ్యక్షులు టీ. శ్రీనివాస్, సత్యనారాయణ, టీ. శేఖర్, జి రాకేష్, నానీ పాల్గొన్నారు.