టీఎన్జీవో ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని టీఎన్జీవో జిల్లా కార్యాలయం ఆవరణలో ఆదివారం ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ప్రతి పౌరునికి చేరవేటలో ఉద్యోగులందరూ ప్రముఖ పాత్ర వహిస్తున్నారని అన్నారు. కొత్తగా వచ్చే పథకాలన్నింటినీ కూడా ప్రజలందరికీ చేరవేస్తూనే ఉద్యోగుల హక్కుల సాధన కొరకై పోరాడటానికి ఉద్యోగులందరూ  సమాయతo కావాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉద్యోగి అవార్డు...