Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 6:24 pm Posted by : ramakrishna

బాన్సువాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసారు. అనంతరం ఇటీవల మృతి చెందిన ఇద్దరు పాత్రికేయులకు సంతాపంగా రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గంట చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు శ్యామ్ సుందర్, సీనియర్ పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.