తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆర్మూర్, బతుకమ్మ :   జక్రాన్ పల్లి మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతం ఆలపించగా, విద్యార్థులు దేశభక్తి భావంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, నృత్యాలు, ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆటలలో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయిని సుధారాణి  తమ సందేశంలో భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను, గణతంత్ర దినోత్సవం విశిష్టతను వివరించి,...