Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 7:14 pm Posted by : ramakrishna

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని 9వ డివిజన్లో లేబర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడి కేంద్రం వద్ద కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పత్తి స్వప్న శోభన్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం 9వ డివిజన్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అల్లాడి సుజాత కిరణ్ వేణు భాగ్య డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.