Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 6:29 pm Posted by : ramakrishna

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలో గురుద్వార్ వద్ద బిజెపి యువ నాయకుడు కృష్ణ పాటిల్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం నాటి నుంచి నేటి వరకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన అమరవీరులకు అశ్రునివాళులు అర్పిస్తూ, వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దీపక్, శివ, కిరణ్, బంటు, రఘు, రాజేష్, సాయి, 50వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.