Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 7:25 pm Posted by : ramakrishna

టీఎన్జీవో కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

 

టీఎన్జీవో జిల్లా కార్యాలయ ఆవరణలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం  ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు, జిల్లా ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విధినిర్వాహణలో అంకితభావంతో విధులు నిర్వహించడం మూలాన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు చేరుటలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రముఖ పాత్ర అమోఘమన్నారు. ఇదే వరవడిని కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.రాష్ట్ర అభివృద్ధికి  వెన్నెముక అయినటువంటి ఉద్యోగుల పెండింగ్ లో గల సమస్యలను తీర్చే బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని, ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.