Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 6:35 pm Posted by : ramakrishna

డిఎఫ్ఓ ను కలిసి సామిల్ టింబర్ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ కామారెడ్డి సామీల్ టింబర్ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఇటీవల కామారెడ్డి డిఎఫ్ఓగా నీరజ్ కుమార్ టిబ్రేవాల్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. శుక్రవారం డిఎఫ్ఓను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. డిఎఫ్ఓ ను కలిసిన వారిలో కామారెడ్డి జిల్లా సామిల్ అండ్ టింబర్ మర్చంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పోతరాజు వెంకటేశ్ పెరిక, జనరల్ సెక్రటరీ వాజిద్,  కోశాధికారి తమీం, వైస్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, చీఫ్ అడ్వయిజర్ ఆజంఖాన్, సలహాదారులు అన్వర్, యూసఫ్, చంద్రం, సభ్యులు నాగరాజు, స్వామి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.