Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 October 2025, 3:08 pm Posted by : ramakrishna

పిసిసి చీఫ్ ను కలిసిన పద్మశాలి మహిళా సంఘం ప్రతినిధులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు. మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా శనివారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు చాట్ల అన్నపూర్ణ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహిళా సంఘం ప్రతినిధులు పలు సమస్యలను మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత పద్మశాలి సంఘం సెంట్రల్ కమిటీ సభ్యులు దాసరి నర్సింలు, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మైసల నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు గంగా ప్రసాద్, సహాయ కార్యదర్శి పద్మ సుభాష్, మహిళా సంఘం ఉపాధ్యక్షులు బైస రమాదేవి, ప్రచార కార్యదర్శి గిరిజ, సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.