Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2025, 6:02 pm Posted by : ramakrishna

చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించిన మానవ హక్కుల సంఘం ప్రతినిధులు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణలో భూస్వాముల ఆగడాలపై తిరగబడ్డ చాకలి ఐలమ్మ భావితరాలకు స్పూర్తి అని నేషనల్ హూమన్ రైట్స్  అండ్ సోషల్ జస్టీస్ కమిషన్ జిల్లా అధ్యక్షురాలు తేలు సరితా పటేల్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని నగరంలోని వినాయక్ నగర్ లోని చాకలి ఐలమ్మ విగ్రహం కు నేషనల్ హూమన్ రైట్స్  అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తేలు సరిత మాట్లాడుతూ… తెలంగాణలో విసూనుర్ దేశ్ ముఖ్ రాంచంద్రారెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన తిరుగుబాటు తరతరాలకు ఆదర్శం అన్నారు. మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఐలమ్మ స్పూర్తితో మహిళ హక్కుల కోసం పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పట్టేపురం వీణరాణి, స్టేట్ జనరల్ సెక్రెటరీ అశోక్ కుమార్, స్టేట్ సెక్రటరీ మధు, అసోసియేషన్ నెంబర్స్ స్వాతి రెడ్డి, ఇమ్రాన్, విజయ తదితరులు పాల్గొన్నారు.

Representatives of human rights groups paid tribute to Chakali Ailamma